Tuesday, February 23, 2010

కలల ప్రపంచం - నిజ జీవితం

కలల ప్రపంచం లో బ్రతుకుతున్న ఒక అమ్మాయి
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా కట్టుకుంది
ఆ ప్రపంచంలో తను ఒక యువరాణి గా చిత్రించుకుంది
తనకి ఏ కష్టాలు ఉండవు, అన్నీ సుఖాలే ఉంటాయి అని అనుకుంది,
తన జీవితాన్ని ఒక నందన వనం లా, అందమైన బృందావనం లా ఊహించుకుంది,
కాని ఒక రోజు "నిజం" అనే భూతం ఎదురుపడింది, తను ఊహించుకునేవి అన్నీ
కలలే అని చెప్పింది, కలలు ఎప్పటికి నిజం కావు అని వాదించింది.
కాని ఆ అమ్మాయి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు, "నిజం భూతం" కి కోపం వచ్చింది,
ఆ అమ్మాయి కట్టుకున్న కలల ప్రపంచాన్ని తన బలమైన కాళ్ళతో జాలి లేకుండా కూల్చేసింది
ఆ అమ్మాయిని ఒంటరిగా ఈ పాడు లోకంలో వదిలేసింది
ఇప్పుడు ఆ అమ్మాయి తను ఒంటరిని అనే బాద తన్నుకోస్తున్నా
గుండెల్ని పిండేస్తున్నా, ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఏ గమ్యం తెలియని చోటకి

5 comments:

Anonymous said...

ఇది పాటకానేకాదు. ఏ రాగం నాకురాదు.

శ్రీనివాస్ said...

ఎవరా అమ్మాయి పాపం .... అలా కలలు కనింది ?

కొత్త పాళీ said...

పాపం!
ఆ అమ్మాయికి శ్రీనివాస్‌ని పరిచయం చెయ్యండి, మళ్ళీ కలలలోకం కట్టిపెడతారు ఆమెకోసం :)

sai said...

Hi Swetha,
Your blogs are very nice. They are sweet and sensitive like flowers. Keep it up.
sairam

Anonymous said...

hello swethagaru ,

That's nice poem ......