Showing posts with label క్షమించవా ప్రియతమా....... Show all posts
Showing posts with label క్షమించవా ప్రియతమా....... Show all posts

Saturday, August 29, 2009

క్షమించవా ప్రియతమా..........

ప్రియతమా,

నన్ను క్షమించుమా. ఆవేశం లో అన్న మాట ఎన్నో అనర్దాలకి దారి తీస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. మన మధ్య చిలిపి తగువులే కాని పెద్ద పోట్లాటలు ఉండ కూడదు. మనం ఒకరికి ఒకరు అని ఆ పైవాడే నిర్ణయించేసాడు.అది కాదని మనం ఒకరి తోడు మరొకరికి లేకుండా బ్రతకగలమా????? ఇప్పటి వరకు నేను నీతో ఎంతో అందమైన క్షణాలని అనుభవించాను. ఇక ముందు కూడా నా జీవితంలో నీతో గడిపే ప్రతి నిముషం ఎంతో మధురంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎప్పటికి చెరగని నీ చిరునవ్వుతో మొదలయ్యే మన ఉదయాలు, నిన్ను చూడబోయే సాయంత్రాల గురించి మధ్యాహ్నం నుంచే ఎదురుచూపులు, రాత్రి వేళ నీ వెచ్చని కౌగిలిలొ గువ్వపిల్లలా ఒదిగిపోవటం .......... ఇవన్ని మన రాబోయే అందమైన జీవితానికి కొన్ని ఉదాహారణలు మాత్రమె. త్వరలో మనం ఏకం కాబోతున్నపుడు, మన మధ్య దాంపత్యం అనే బంధం ఏర్పడబోతున్నప్పుడు, మన మధ్య ఉండవలసినవి ప్రణయ పోరాటాలు, అలకల పలక పైరాసే చిలిపి జ్ఞ్యాపకాలేకాని, గుండెల్ని గాయపర్చే పెద్ద పోట్లాటలు కాకూడదు.

నీతో ఎంతో అందమైన, ఆనందమైన జీవితాన్ని ప్రతి నిముషం ఆస్వాదించాలని కోరుకుంటూ, పెద్ద మనసుతో నన్నుక్షమిస్తావని ఆసిస్తూ
నీ ప్రేయసి