Tuesday, February 23, 2010

కలల ప్రపంచం - నిజ జీవితం

కలల ప్రపంచం లో బ్రతుకుతున్న ఒక అమ్మాయి
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా కట్టుకుంది
ఆ ప్రపంచంలో తను ఒక యువరాణి గా చిత్రించుకుంది
తనకి ఏ కష్టాలు ఉండవు, అన్నీ సుఖాలే ఉంటాయి అని అనుకుంది,
తన జీవితాన్ని ఒక నందన వనం లా, అందమైన బృందావనం లా ఊహించుకుంది,
కాని ఒక రోజు "నిజం" అనే భూతం ఎదురుపడింది, తను ఊహించుకునేవి అన్నీ
కలలే అని చెప్పింది, కలలు ఎప్పటికి నిజం కావు అని వాదించింది.
కాని ఆ అమ్మాయి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు, "నిజం భూతం" కి కోపం వచ్చింది,
ఆ అమ్మాయి కట్టుకున్న కలల ప్రపంచాన్ని తన బలమైన కాళ్ళతో జాలి లేకుండా కూల్చేసింది
ఆ అమ్మాయిని ఒంటరిగా ఈ పాడు లోకంలో వదిలేసింది
ఇప్పుడు ఆ అమ్మాయి తను ఒంటరిని అనే బాద తన్నుకోస్తున్నా
గుండెల్ని పిండేస్తున్నా, ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఏ గమ్యం తెలియని చోటకి

Friday, February 5, 2010

ఒంటరినైపోయాను

ఒంటరి గానే ఈ లోకంలో అడుగుపెట్టాను
ఒంటరి గానే ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంటాను
మరి ఒంటరిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాను?
నా వాళ్ళు నన్ను ప్రేమించాలి, అర్ధం చేసుకోవాలి అనే తపన,
నా వాళ్ళను సుఖపెట్టాలి అని ప్రతి నిముషం ఆరాటం,
నన్ను వాళ్ళు ఎప్పుడు ఒంటరి దాని గా చేయద్దు అనే తాపత్రయం
ఇంత తపన పడ్డా కూడా చివరికి ఒంటరి దాన్నే అయ్యాను
ఒంటరి తనం లో ఆనందం పొందితే వేదాంతి అంటారు,
ఒంటరి తనం లో బాద పడితే మనిషి అంటారు
ఒంటరి గానే పుట్టి ఒంటరి గానే చస్తాను అనే జీవిత సత్యం తెలిసినా
ఇంకా ఒంటరి తనానికి నేను భయపడుతున్నాను.
Finding happiness when alone is "Solitude", getting depressed when alone is "Loneliness"