Wednesday, July 4, 2018

నువ్వంటే ఇష్టం

గల గల పారే గోదారి  
కిల కిల ఎగిరే పక్షులు 
బోసి నవ్వుల చిన్నారులు 
అమ్మ ప్రేమగా పెట్టె గోరు ముద్దలు  
చంద్రుని చుట్టూ చుక్కలు 
ఇవన్నీ ఇష్టమే కానీ నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం 
నీ నవ్వంటే  ఇంకా ఇష్టం 
నీ కళ్ళల్లోకి చూస్తే ఏదో ధైర్యం 
నీతో మాట్లాడితే కొండంత సంతోషం 
వీలైతే క్షమించవా నేస్తం 
ఉండి పోవా నాతో జీవితాంతం?



Saturday, June 30, 2018

మళ్ళీ వచ్చిన వసంతం

మోడు వారిన జీవితంలోకి కొత్తగా వచ్చిన వసంతం 
కమ్మగా కూస్తున్న కోయిలలు 
సువాసనలు వెదజల్లుతున్న మల్లెతీగలు 
చల్లని వెన్నెల రాత్రులు 
వయ్యారంగా ఊగుతున్న గొల్లభామలు 
నవ్వుతూ ఆహ్వానిస్తున్న గులాబీలు 
మళ్ళీ కొత్తగా కనిపిస్తున్న బంగారు లోకం 
నా జీవితంలో కొత్త ఊపిరి పోసిన ప్రియా నేస్తమా 
నా మనసులోకి పునఃస్వాగతం 

                                                  ఇట్లు 
                                        నీ ప్రేమకి నోచుకోని నీ ప్రేయసి