Sunday, December 21, 2008

సగటు మనిషి

చిన్నతనం లో పెద్దగా అవ్వాలని తొందర , స్కూల్ కి వెళ్లాలని తొందర ,
స్కూల్ కి వెళ్ళాక పెద్ద క్లాసులకి వెళ్లాలని తొందర, పెద్ద క్లాసు లకి వెళ్ళాక కాలేజీ కి వెళ్లాలని తొందర
కాలేజీ లో చేరాక ఉద్యోగంలో చేరాలని తొందర, ఉద్యోగంలో చేరాక పెళ్లి కి తొందర,
పెళ్లి అయ్యాక పిల్లల కోసం తొందర, పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అవ్వాలని తొందర,
పిల్లలు పెద్ద అయ్యాక, వాళ్లు సరిగ్గా చూడక పోతే చచ్చిపోవాలనే తొందర,
కాని చివరకి చనిపోయే ముందు తిరిగి చూసుకుంటే, జీవితంలో అన్నీటికి తొందర పడటం తప్ప చేసిందేమీ
లేదు అని తెలిసింది, కాని అప్పటికే జీవితం అయిపొయింది.

సగటు మనిషి రేపు ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఇవాళ ఎలా బ్రతకాలో మరచిపోతున్నాడు.
"స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ లివింగ్" అని ఎక్కడో చదివాను నేను, అది అందరు పాటిస్తే ఎంత బాగుంటుందో కదా?
జీవితాన్ని జీవితంలా జీవించండి, దాని లోని మధుర్యాని ఆస్వాదించండి.
అంతే కాని అందరికంటే బాగా ఉండాలనే తపనతో జీవితాన్నే ఒక పోటి పరీక్షగ మార్చకండి

Thursday, November 20, 2008

ప్రియురాలికి ప్రేమలేఖ

నా ప్రాణానికి ప్రాణమైన నీకు,

నీ జీవిత సర్వస్వాన్నైననేను వ్రాయునది, నా అందమైన జీవితాన్ని మరెన్నో రెట్లు అందంగా మార్చావు నీవు.
అసలు జీవితంలో ఇంత ఆనందం నిజంగా ఉంటుందా అనిపించేంత ఆనందాన్నిచ్చావు నాకు.
జీవితం పోరాటం కాదు, ఒక అందమైన స్వప్నం, దాన్ని అపురూపంగా చూసుకోవాలని నేర్పావు.
నీ ప్రేమలో అన్ని మరచి స్వర్గం అంచుల దాక తీసుకెళ్ళావు.
ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్న నేను "ఇది కల కాదు కదా" అని భయపడినప్పుడు, నీ చేతి స్పర్శతో ఇది నిజమేననే భావన కలిగించావు.
జీవితపు చరమాంకం వరకు తోడుంటానని బాసలు చేసావు.
ఎన్నో ఊసులు చెప్పావు.
జీవితంలో ఏదో సాధించాలని తపన పడుతూన్నప్పుడు, జీవితాన్నే సాధించు, జీవిత మాధుర్యాన్ని ఆస్వాధించమన్నావు.
శాస్త్రాల్లో చెప్పినట్టు, కార్యేషు దాసీ, భోజ్యేషు మాతా, కరణేషు మంత్రి లా నా తోడు నిలిచావు.
జీవితభాగస్వామి అంటే కేవలం సుఖాల్లోనే కాదు, కష్టాలలోను భాగం పంచుకుంటుందని నిరూపించావు.
జీవితంలో పెద్ద కోరికలు తీరినప్పుడు కంటే ప్రతి రోజు కలిగే చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటంలో ఎక్కువ ఆనందం ఉందని నేర్పావు.
ఇంతటి ఆనందాన్ని, మధురానుభూతుల్ని, అందమైన జ్ఞాపకాల్ని అందించిన ఓ ప్రియసఖియా, జన్మజన్మలకి నువ్వే నా ప్రాణం కావాలని కోరుకుంటున్నాను.
ఇట్లు,
నువ్వు లేక బ్రతకలేని
నీ సర్వస్వం

Wednesday, November 19, 2008

అందమైన అనుభవాలు

నీ తియ్యని మాట, ఆ చిలిపి చిరునవ్వు,
నీతో పంచుకున్న అందమైన సాయంత్రాలు,
సముద్రపు ఒడ్డున కలిసి వేసిన అడుగులు,
వర్షపు సాయంత్రాన ఒకే గొడుగు కింద కలిసి నడవటం,
విరబూసిన వెన్నెల్లో మనం కలిసి లెక్కపెట్టిన తళుకుతళుకు తారకలు,
మనకోసమే సువాసనలు వెదజల్లిన మల్లెతీగలు,
మంచుకురిసినప్పుడు వెచ్చగా నీ ఒడిలో ఒదిగిన జ్ఞాపకాలు,
మనిద్దరం కలిసి సృష్టించుకున్న అందమైన అనుభవాలు,
ఎన్నటికి మాసిపోనివి ఈ మధుర జ్ఞాపకాలు.
నా జీవితంలో ఇంత మంచి అనుభూతిని మిగిల్చిన ప్రియతమా నీకు నా కృతజ్ఞతలు.

ఇట్లు
నీ గుండెల్లో గూడు కట్టుకున్న నీ ప్రేయసి




Friday, October 17, 2008

సూర్యోదయం

పక్షుల కిల కిల రావాలు,
కోయిల కుహు కుహు గానాలు
లేలేత గులాబీలపై మంచు బిందువులు
ఇంట్లోకి వచ్చే నులివెచ్చని సూర్యకిరణాలు
ముంగిళ్ళలో ముద్దుగుమ్మల ముచ్చటైన ముగ్గులు
అమ్మ చేతి కాఫీ ఘుమఘుమలు
పేపరు కోసం నాన్న ఎదురుచూపులు
సుర్యోదయంకల్లా బామ్మలు చేసే దైవ పూజలు
దూరంగా గుడిలో వినిపించే సుప్రభాతాలు,
స్కూలుకి వెళ్ళకుండా మారాం చేసే చిన్నారులు.....
ఇది కొన్నాళ్ళ క్రితం నేను అనుభవించిన అందమైన సూర్యోదయం

Thursday, October 16, 2008

ఆమె

ఆమె నవ్వితే అమృతవర్షం కురిసినట్టు ఉంటుంది
ఆమె నడిస్తే పాదాలు కందిపోతై అనే అంత సుకుమారంగా ఉంటుంది
ఆమె మాటతీరు తొలకరి వాన చినుకులా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది
ఆమెని చూస్తే దేవలోకాలలో విహరించవలసిన దేవకన్య దారి తప్పి నా ముందుకి వచ్చిందా అనిపిస్తుంది
ఆమె నిలబడితే, గల గల పారే సెలయేరు, ఆమెని చూడడానికే నిశ్చలంగా నిలబడి ఉందా అనిపిస్తుంది
ఆమె మనసు పాల నురగ అంత స్వచ్చంగా ఉంటుంది

మొత్తానికి, ఆమె బాహ్య సౌందర్యం, ఆత్మ సౌందర్యం, ఎంతో అందమైన ప్రకృతి కూడా ఈర్ష్య పడేంత అందంగా ఉంటుంది.
ఇంతకి, ఈ అందాల రాశి ఎవరో తెలుసా??? ఊహించగలరా???

నా ఊహలకు మాత్రమే పరిమితమై, నా కవిత్వంలోకి అడుగిడిన నా కథా నాయిక.

Tuesday, October 14, 2008

నా కుటుంబం

ప్రతి బిడ్డకి తను పుట్టబోయే తల్లి తండ్రులని, కుటుంబాన్ని, పెరిగే వాతావరణాన్ని ఎంచుకొనే అవకాశం ఉండదు.
కొంత మంది చాలా ఉన్నతమైన విలువలు కల కుటుంబంలో పుడతారు, అలాగే పెరుగుతారు. అది వారి అదృష్టం.వారికి ఆస్తి, అంతస్తు తృణప్రాయం కాక పోయినా, అవే జీవితం మాత్రం కావు. ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వారు చాలా ఉన్నతమైన వ్యక్తులుగా సమాజంలో ఎదుగుతారు. ఇంకా కొంత మంది మానవత్వం కంటే డబ్బుతత్వంకి ఎక్కువ విలువ ఇచ్చే కుటుంబంలో పుడతారు. ఇలాంటి పిల్లలు తల్లి తండ్రి తమ పట్ల తక్కువ శ్రద్ధ చూపించటం, డబ్బు, పరువు, ప్రతిష్టల పట్ల ఎక్కువ ప్రేమ చూపించటం తట్టుకోలేరు, వారి చిన్ని మనసులు గాయపడతాయి. కాని క్రమేణా వాళ్లు కూడా తల్లి తండ్రుల లాగానే ఎదుగుతారు. వారు కూడా మానవత్వానికి విలువ చూపరు. తమకు పుట్టబోయే పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు.
ఇక మూడవ కోవకి చెందినా తల్లి తండ్రులు కష్టజీవులు. కష్టపడితేనే జీవితంలో పైకి రాగలం అని బలంగా నమ్మినవారు. పిల్లలకి ఏ లోటు రాకుండా పెంచాలనే ప్రయత్నంలో తమ సుఖాలని త్యాగం చేస్తారు. డబ్బులేకపోయిన, స్వంత తెలివితో, చదువు మీద శ్రద్ధ తో, దీక్ష సాదన తో సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు అని పిల్లలకి నేర్పుతారు.
ఈ కోవకి చెందినా తల్లి తండ్రుల కడుపున పుట్టిన అదృష్టవంతులం నేను, నా తమ్ముడు. మాకు ఆస్తులు లేకపోయినా, మా ఇద్దరికీ ఏ లోటు లేకుండా పెంచారు మా అమ్మ, నాన్న. వాళ్లు ఎప్పుడు ఆడ, మగ అనే తేడా నాకు, నా తమ్ముడికి మధ్య చూపించలేదు. ప్రతిదాంట్లో మమ్మల్ని సమానంగా ప్రోత్సహించారు. నేను ఈ రోజు అమెరికా లో ఉద్యోగం చేయగల్గుతున్నాను అంటే అంత వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే. ఇక నా తమ్ముడు పెద్ద చదువులు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు. వాడికి ఉద్యోగం రావటం ఆలస్యం అవుతున్న, చాల మంది తల్లి తండ్రుల లాగ వాడిని దెప్పి పొడవటం లేదు. "నీకు తెలివి, చదువు, ఉద్యోగాని కి కావాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి. ఇవాళ కాకపోతే, రేపు అయిన ఉద్యోగం వస్తుంది" అని చెపుతున్నారు.
ఇక నా కుటుంబంలో, అమ్మ నాన్న తర్వాత నాకు చాల ముఖ్యమైన వ్యక్తి నా తమ్ముడు. వాడు నాకంటే చాల తెలివి కలవాడు, నా కంటే ఎక్కువ చదువుకున్నాడు. (నేను చేసే ఉద్యోగంలో ఏమైనా అవసరం వచ్చినా, వాడే నా సందేహాలు తీరుస్తాడు, సహాయం చేస్తాడు). వాడికి తెలివి, చెడువే కాదు, అందం కూడా ఉంది. వాడు ఇప్పుడు పరిపూర్ణంగా ఎదిగిన యువకుడు. అయినా ఇప్పటికి నన్ను సలహాలు అడుగుతాడు. జీవితం గురించి, ఉద్యోగం గురించి, వాడి జీవితంలో ప్రతి ముఖ్య విషయం గురించి నన్ని సలహాలు అడుగుతాడు. ఇప్పుడు బాగా ఎదిగిపోయాను అని కానీ, ఇంక కొన్ని రోజులలో మంచి ఉద్యోగం వస్తుంది" అని కానీ వాడికి కొంచం కూడా గర్వం లేదు. నేను మా అమ్మ నాన్నలకి దగ్గరగా లేకపోయినా, నేను లేని లోటు లేకుండా, నా బాధ్యతలు కూడా వాడే నిర్వర్తిస్తున్నాడు. ఇవన్ని చేసేది నా తమ్ముడా అని అనిపిస్తుంది నాకు ఒక్కో సారి.

మాకు ఆస్తులు లేకపోయినా , ఇంత మంచి కుటుంబం ముందు అది చాల చిన్న విషయంగా అనిపిస్తుంది నాకు. ఏది ఏమైనా, నాకు పుట్టే పిల్లల్ని కూడా ఇంత మంచి విలువలతో, నా తల్లి తండ్రులు నన్ను పెంచినట్టే, నేను కూడా నా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నాను.

Monday, October 13, 2008

Sneham

"స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం" అనే పాట విన్నప్పుడల్లా అనిపిస్తుంది....
స్నేహమే జీవితం కాకపోవచ్చు కానీ, స్నేహం శాశ్వతమే.
ప్రతి మనిషీ తన తల్లి తండ్రులకి, ఇంట్లో వాళ్ళకి, కనీసం జీవిత భాగస్వామికి చెప్పుకోలేని విషయాలు కూడా దాపరికం లేకుండా చెప్పుకునే ఏకైక వ్యక్తి "స్నేహితుడు / స్నేహితురాలు".
ఆడ, మగ అనే తేడా లేకుండా, తారతమ్యాలు లేకుండా, అంతస్తుల తేడా లేకుండా నిష్కల్మషంగా చేసేదే "స్నేహం".
ప్రతి కష్టాన్ని, అన్ని సుఖాలని, చిన్న చిన్న రహస్యాలని కూడా పంచుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు.
కష్టం వచ్చినప్పుడు కన్నీరు తుడిచి, ఆనందం వచ్చినప్పుడు నవ్వులు పంచుకొని, రహస్యం చెప్పినప్పుడు గుండెల్లో దాచుకుని, ప్రతి నిముషం నీ వెన్నంటే ఉంటాను అని హామీ ఇచ్చే స్నేహితులు మీకు ఉన్నారా? ఉంటే మీరు "అదృష్టవంతులు".
నేను కూడా ఆ అదృష్టవంతుల కోవకి చెందినదాన్నే. నా ప్రాణస్నేహితుడి పేరు "ఉపేందర్", ముద్దుగా "కోతి" అంటాము.

Saturday, September 20, 2008

నా కలల రాజకుమారుడు

ఎన్నో వేళ భావాలని కేవలం చూపుతోనే చెప్పే లోతైన కళ్లు ,
రాజసం ఉట్టి పడే టీవైన నడక ,
ఎన్ని కష్టాలొచ్చినా నిన్ను పట్టపురాణిలా చూసుకుంటాను అనే ధీమా ,
నా ప్రతి ముద్దు నీ కోసమే అని చిరునవ్వుని చిందిస్తున్న ఆ పెదవులు ,
నా జీవితంలో భాగం పంచుకో ప్రియతమ అని ఆహ్వానిస్తున్న అతని చేతులు ,
పడి లెగిసిన కడలి తరంగం లా ఉన్నా అతని ఛాతీ ,
నీ స్పర్శ కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను అని చెపుతున్న అతని శరీరం ,
నీ కోసం ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నాను అని చెపుతున్న అతని మనసు .
ఇతడే నా కలల రాకుమారుడు , మరి నిజ జీవితంలో అవుతాడా నా వరుడు ???

అందం

అందం అంతా నా దగ్గరే ఉంది ,నా కంటే అందగత్తెలు ఎవరు లేరు అనే గర్వం నాకు .

అద్దంలో చూసుకున్నప్పుడల్లా , నన్ను అందరు చూసి ఈర్ష్య పడే అంత అందం ఉన్నందుకు లోలోపల ఆనందం .

రవి వర్మ కుంచె నుంచి ఝాలువారిన ఎంకి లా ఉంటుంది నా అందం .

కాని , భాహ్య సౌందర్యమా ముఖ్యం ???ఎవ్వరికి పనికిరానిది నా అందం .

ఆత్మ సౌందర్యం కంటే గొప్పదా ఈ అందం ??? కాదేమో ???

మరి అందరు నా అందం వెనక పడతారెందుకు ?

నా అందాన్ని కాక నన్ను నన్నుగా ప్రేమించే వాడు దొరుకుతాడా ?నన్ను వరిస్తాడా?

Saturday, August 23, 2008

భావుకత

భావుకత్వం భావకవికే సొంతమా ?
ప్రేమకు స్పందించే ప్రతి ఆడపిల్ల మనసులో లేదా భావుకత ?
తెల్లవారుఝామున పక్షుల కుహు కుహు రాగాలు వినాలని ,
సాయం సంధ్యవేళ గోదూలిని ఆస్వాదించాలని ,
మంచు బిందువు నిల్చిన గులాబి రేకుల్ని తాకాలని ,
బోసి నవ్వుల చిన్నారిని ముద్దాడాలని ,
ప్రియుని వెచ్చని కుగిలిలో ఒదిగిపోవాలని ఆశ పడే ప్రతి కన్నెపిల్ల కళ్ళల్లో
తారాడుతుంది భావుకత .

Saturday, June 28, 2008

మనసు

ఊహల పల్లకిలో తేలియాడుతున్న వేళ , అతడిని చూసి గతి తప్పిన నా మనసు ,
అతని వెంటే పరిగెత్తిన్న నా కళ్లు ,
అతడిని పిలవాలని ప్రయత్నించినా , పేరు తెలియక చిగురుటాకులా వణికిన నా పెదవులు ,
అతనీ తిరిగి నా వైపుగా వస్తాడేమో అనే చిన్ని ఆశ తో అన్ని శబ్దాలను ఆలకించిన నా చెవులు ,
అతను చూడనిదే , ఎందుకు అందంగా ఉండాలనే కోపం తో వెలవెల పోయిన నా మోము ,
అతని కోసం కాకపోతే నన్ను సవరించలేవా అని ప్రశ్నించిన నా చిక్కుపడిన ముంగురులు ,
వెరసి , నేను ప్రేమలో పడ్డానని గేలి చేసిన నా చెలికత్తెలు ,
ఇవన్ని గడచి నాలుగేళ్ళు గడిచినా , ఇంకా కొత్తగానే ఉన్నా ఆ గుర్తులు.

నేడు , అతను నా వాడు , నేనే సర్వస్వంగా బ్రతుకుతున్నాడు .
అందుకే నా మనసు పలికేది మౌనరాగం కాదు , ఉల్లాస గీతం ,
నా ప్రేమ ఫలించిందనే ఆనంద గానం.

అందం

బాపు గీసిన బొమ్మలా ,
రవి వర్మ కుంచె నుంచి ఝాలువారిన ఎంకిలా ,
అమర శిల్పి చెక్కిన అందమైన శిల్పంలా ,
వెన్నెల కురిసిన రాత్రి విరిసిన మల్లెలా ,
ఉదయించే సూర్యునికి తోడుగా వికసించే పూవులా ,
ఎంతో కమ్మగా పాడే కోయిల పాటలా ఉంది ఆ అమ్మాయి అందం.
అందానికి మారు పేరులా ఉన్నా ఈ భామ ఆ బ్రహ్మ దేవుడు సృష్టించిన అపురూపమైన బొమ్మ.

వర్షం

ఆకాశంలో మేఘాలు చూసినప్పుడల్లా మనసులో ఏదో తెలియని ఆనందం
ఆ మేఘాలు చినుకులై కురుస్తున్న వేళ బాధలన్ని మరచి మయురిలా నాట్యం చేయాలనే ఆలోచన
మధ్య మధ్యలో కొరడా లా అనిపించే మెరుపులు మెరిసినప్పుడు గుండెల్లో అలజడి
ఈ వర్షం నా జీవితాంతం ఇలాగే కురిస్తే బాగుండు అనే పిచ్చి కోరిక
తెర చాటున కనిపించీ , కనిపించని ప్రేయసి మొములా అనిపిస్తుంది ఈ వస్తు ఆగిపోయే వాన
ఇంత ఆహ్లాదంగా నా మనసుని మార్చి అలా మాయమైన వర్షం మళ్ళీ ఎప్పుడొస్తుందో అనీ ఎదురుచూపులు
మళ్ళీ వర్షం కురిసేటప్పటికి నేను వాడిపోతానేమో అనే భయం ,
అన్ని కలగలసి ఆనందంగా నిద్రపోయాను
ఇంతకి నా పేరు చెప్పలేదు కదు ? నా పేరు “మల్లె పూవు ”.

ప్రతీక్ష

ప్రతి తల్లి నన్ను చూసి ఈర్ష్య పడేంత అందం నా చిట్టి తల్లిది ,
బోసి నవ్వులోలికిస్తూ తన చుట్టూ ఆనందాన్ని వెదజల్లుతున్న ఆ మోము ,
తన అమాయకత్వంతో అందర్ని మురిపిస్తున్న పాల బుగ్గల చిన్నారి ,
మా నట్టింట అడుగిడబోయే మా అష్టలక్ష్మి ,
మా ఇంటి లోగిట్లో చీకట్లని తొలగించి , సంతోషపు దివ్వెలని వెలిగించే మా సౌందర్య రాసి ,
మా మనసుల్ని రాజ్యమేలే మా పట్టపు రాణి మా జీవితాల్లోకి ఎప్పుడొస్తుందో అనే ప్రతీక్ష .

అమ్మ - నాన్న

అనురాగానికి , ఆప్యాయతకు మారు పేరు అమ్మ ,నాన్న
ఆ దేవుడు నాకిచ్చిన అపురూపమైన కానుక వీళ్ళ కడుపున పుట్టటం ,
ఎన్ని కష్టలోచ్చినా ఎదుర్కొని ధైర్యంగా పోరాడాలని నేర్పి ,
నేను భయపడిన ప్రతి సారి , నీ వెనుక మేమున్నామని వెన్నుదన్నుగా నిలబడి
నేను ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వీళ్ళే , ఎం చేసినా తీర్చుకోలేనిది ఈ ఋణం .

Sunday, March 2, 2008

Lyrics of my fav song - "Nuvvu Nuvvu" from Khadgam

nuvvu nuvvu nuvvE nuvvunuvvu nuvvu nuvvunuvvu nuvvu nuvvE nuvvunuvvu nuvvu nuvvunaalOnE nuvvunaatOnE nuvvunaa chuTTu nuvvunEnantaa nuvvunaa pedavipainaa nuvvunaa meDa vompuna nuvvunaa gunDe meeda nuvvu voLLantaa nuvvubuggallO nuvvu moggallE nuvvumuddEsE nuvvuuniddaralO nuvvu poddullO nuvvuprati nimusham nuvvuu naa vayasunu vEdhinchE vecchadanam nuvvunaa manasuni laalinchE challadanam nuvvupaiTE baruvanipinchE pacchidanam nuvvubaiTa paDaalanipinchE picchidanam nuvvunaa prati yuddham nuvvunaa sainyam nuvvunaa pRiya SatRuvu nuvvu nuvvumettani mulle gille toli chinuke nuvvunacchE kashTam nuvvu nuvvu
naa sigguni dachukone kougilive nuvvunaa vanni dOchukunE korikave nuvvumunipanTitO nanu gicchE nEraanivi nuvvunaa naDumunu naDipinchE nEsthaanivi nuvvuteerani daham nuvvu naa moham nuvvu tappani sneham nuvvu nuvvuteeyani gaayam chEsE anyaayam nuvvuayinaa ishTam nuvvu nuvvu maimaripistuu nuvvumuripistunTE nuvvunE kOrukunE naa marO janma nuvvukaipekkistuu nuvvu kavvistunTE nuvvunaakE teliyani naa kotta pEru nuvvunaa andam nuvvu aanandam nuvvunEnanTE nuvvunaa pantam nuvvunaa sontam nuvvunaa antam nuvvu

Wednesday, February 27, 2008

నిరీక్షణ

నా జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన కోసం నిరీక్షణ
అసంభవం కాకా పోయినా ఈ సమయాన నేను ఏమి చేయలేనే అనే

ఆవేదన
భగవంతుడా , నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావ్ నాయన అనే ప్రశ్న
ఏదైనా అదృశ్య శక్తీ వచ్చి నాకు ఈ సహాయం చేయాలి అనే ప్రార్ధన ,
ఎప్పటికైనా ఈ అదృష్టం నా తలుపు తట్టక పోతుందా అనే ఆలోచన

హా , నా పిచ్చి కాకా పోతే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది , ఏ సమయాన జరగాలంటే అప్పుడే జరుగుతోంది కాని , నా ఆలోచనల వల్ల ఏమవుతుంది ?????

Sunday, January 13, 2008

నీ కోసం

నిన్నే ప్రేమించాను , నీ కోసమే జీవించాను ,

నా తనువు , ప్రాణం నువ్వేనని భావించాను ,

కాని నువ్వు నన్ను నా కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నావని

ఒప్పుకోవెం ప్రియతమా ,

నేనిలా దుఖిస్తుంటే చూస్తూ వూరుకుంటావు ఏం ప్రాణమా ,

నీ శ్వాసలో నేను ఉన్నానని , నీ ఊపిరే నేను అని

చెప్పవేం ప్రియతమా ,

నిన్ను చూడాలని , మనసారా కౌగిలించుకోవాలి అనే

నా కోరిక తీరేనా ప్రాణమా ?



నీ కోసమే జీవించే ,
నీ ప్రేమ

ప్రేమ పక్షులు

నీ ప్రేమే నా జీవితం ,
నీ ప్రేమ సాధనే నా లక్ష్యం ,
ఎంతో నేర్పిన నీ స్వభావం ,
చిరునవ్వునిచ్చిన నీ చిలిపితనం ,
నీ కోసమే నే జీవించాలని చెప్పిన నీ స్నేహం ,
ఏదైనా సాధించగలను అని చెప్పిన నీ ఆత్మస్త్థెర్యం ,
"నువ్వు నాకే సొంతం " అని చెప్పకనే చెప్పిన నీ మౌనం ,
నువ్వు లేనిదే లేదు నాకు జీవితం ,
ఇకనైనా నమ్ము ప్రియ , నీ ప్రేమ సాధనే నా లక్ష్యం .

Thursday, January 10, 2008

పెళ్లి

పెళ్లి అనే మూడు ముళ్ళ బంధం
రెండు మనసులని కలిపే అనుబంధం
రెండు తనువులను కలిపే సంబంధం
ఎన్నో కలల తో మెట్టినింట్లో అడుగిడే ఆడపిల్ల కి ,
నువ్వు ఇక నుంచి మా లో ఒకరివి అని అత్త గారు చూపే అనురాగం
కన్న కూతురిలా చుస్కుంటాను కోడలా అని మామ గారు చూపే పెద్దరికం ,
ఇక జీవితాంతం నీకు తోడై ఉంటాను అని శ్రీవారు చేసే ప్రమాణం ,
అన్ని కలిసి పెళ్లి అనే బంధం తో స్త్రీకి దొరికే ఒక సంపుర్ణత్వం ,
ఇన్ని బంధాల మేలు కలయికే , పెళ్లి అనే అపురూపమైన ప్రమాణం .