Friday, September 18, 2009

నా వేసవి జ్ఞాపకాలు...

ఉమాశంకర్ గారి "Anantham" బ్లాగ్ చదివిన తర్వాత నాకు నా చిన్నప్పటి వేసవి సెలవలు గుర్తుకొచ్చాయి. వేసవి జ్ఞాపకాలు అనటంకంటే "నా చిన్న నాటి మధుర స్మృతులు" అనటం చాల కరెక్ట్ అనుకుంటా.
మా అమ్మమ్మ మా అమ్మ చిన్నతనం లోనే చనిపోవటం వల్ల నాకు మా తమ్ముడికి అమ్మమ్మ గారిల్లు ఉన్నా లేనట్టే. మా అమ్మని సొంత కూతిరి లా పెంచింది మా పెద్దమ్మ (మా అమ్మకి పెద్దక్క) పెద్దనాన్న. ప్రతి సంవత్సరం మా వేసవి సెలవులన్ని మా పెద్దమ్మ వాళ్లా ఇంట్లోనే గడిచేవి.
మా పెద్దమ్మ వాళ్ళది ఖమ్మం జిల్లాలో గోపవరం అనే చిన్న పల్లెటూరు. మా సెలవుల సందడి మా చివరి పరీక్ష సోషల్ స్టడీస్ తోనే మొదలయ్యేది. మా పెద్ద నాన్న ఆ రోజు తెల్లవారుఝామున వచ్చేసేవారు మమ్మల్నిద్దరిని ఊరికి తీసుకెళ్ళడానికి. పరీక్ష మధ్యాహ్నం కల్లా అయిపోవడం తరువాయి, ఇంటికి రావడం, భోజనం చెయ్యటం, రెండింటికల్లా భయల్దేరే వాళ్ళం బస్సులో. అస్సలు ఈ బస్సు ప్రయాణం అంటే మాకు ఎంత సరదానో చెప్పలేను. బస్సు ఆగిన ప్రతి చోట మా పెద్దనాన్న మాకు అడిగిందల్లా కాదనకుండా తినుబండారాలు కొనిచ్చేవాడు. రాత్రి పదింటికల్లా ఖమ్మం లో దిగేవాళ్ళం. మా ఊరికి వెళ్ళే చివరి బస్సు అప్పటికల్ల వెళ్ళిపోయేది. మళ్ళి తెల్లవారు ఝామున నాలుగింటి వరకు మా ఊరికి బస్సు ఉండదు. అప్పుడు మా పెద్దనాన్న మా ఇద్దరికీ అక్కడే మెస్సులో భోజనాలు పెట్టించి, పక్కనే ఉన్న సినిమా హాల్ కి తీసుకెళ్ళేవాడు. నేను చివరి సారి వేసవి సెలవులకి (దాదాపుగా పదేళ్ళు అయింది) వెళ్ళినప్పుడు అలా చూసిన సినిమా "సూత్రధారులు" నాకు ఇప్పటికి ఆ సినిమా చూసినా, అందులో పాటలు విన్నా, ఆ వేసవి జ్ఞాపకాలే కళ్ళ ముందు మేదుల్తాయి. అలా సినిమా చూస్తూనే మా తమ్ముడు, నేను మా పెద్దనాన్న చెరో భుజం మీద నిద్ర పోయేవాళ్ళం. సినిమా అయ్యాక పెద్ద నాన్న మమ్మల్ని నిద్రలేపి బస్టాపు కి తీస్కొచ్చి, బాదాం పాలు కొనిచ్చేవాడు. అవి తాగాలంటే మాకు భలే సరదాగా ఉండేది. పాలు తాగి కాసేపు అలా బస్టాపు లోని బెంచిపై కూర్చొని అలా అర్ధరాత్రి కూడా కోలాహలంగా తిరిగే జనాల్ని, తలెత్తి చూస్తే తప్ప కనపడని టెలివిజన్ వైపు మార్చి మార్చి చూస్తూ మళ్ళి నిద్రపోయే వాళ్ళం. తెల్లవారు ఝామున నాలుగింటికి గోపవరం బయల్దేరేది మొదటి బస్సు. ఇక పెద్దనాన్న ముందు మా సామాన్లు బస్సులో పెట్టి వచ్చి , నన్ను నిద్ర లేపి, మా తమ్ముడిని భుజానవేస్కొని బస్సు ఎక్కటం నాకింకా కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ఇక ఆ బస్సులో ఉన్న కోలాహలం చూస్తే మాకు నిద్ర మత్తు వదిలిపోయేది. పాల కేంద్రానికి పాలు పోయటం కోసం పెద్ద పెద్ద క్యాన్లతో ఎక్కే వాళ్లు, పేపరు కట్టలు బస్సు కదిలే ముందే డ్రైవర్ కి అందాచేయాలని ఆత్రుత పడే పేపర్ అబ్బాయిలు, ఆ పేపర్ కట్టలోంచే మొత్తం వార్తలు చదివేయ్యాలి అనే తాపత్రయం తో డ్రైవర్ పక్కనే నక్కి కూర్చునేవాళ్లు, కూరగాయ గంపలు, పళ్ళ గంపల తో, తల నిండా పూలు పెట్టుకొని ఎక్కే ఆడవాళ్ళు ....అబ్బ అసలు వాళ్ళందరిని చూస్తుంటే మాకు చాల సరదాగా ఉండేది. చెప్పడం మర్చిపోయానండోయ్... మా పెద్ద నాన్న ఆ ఊర్లో చెప్పుకోదగ్గా మోతుబరి రైతుల్లో ఒకరవటం, రాజకీయాల్లో తిరగటం వల్ల ఆయన్ని అందరు గుర్తుపట్టేవారు. ఇక మా ఇద్దరి పరిచయం అక్కడే మొదలయ్యేది బస్సులో. (మా అమ్మ పేరు సరస్వతి. అమ్మ పెద్దమ్మ వాళ్ల ఊళ్ళోనే పెరగటం వల్ల అందరికి సరసమ్మ గారిగా తెలుసు). అలా మేము "సరసమ్మ గారి పిల్లలు" గా అందరికి పరిచయడం చేయ బడే వాళ్ళం. అలా మా పరిచయం జరగగానే అక్కడ మేము ఇద్దరమే "ఫోకస్ పాయింట్" అయ్యేవాళ్ళం. అందరు అమ్మాయి, అబ్బాయి ఎంత బాగున్నారు ముత్య్యాల్లాగా అనగానే మేము "మా అంత గొప్ప వాళ్లు లేరు" అనుకునేవాళ్ళం.....అలా సరదాగా మా బస్సు ప్రయాణం జరిగేది......
తర్వాత....మా సెలవులు ఎలా గడిచాయో నా తర్వాతి టపాలో చెపుతాను
అంత వరకు...సెలవు.

Saturday, August 29, 2009

క్షమించవా ప్రియతమా..........

ప్రియతమా,

నన్ను క్షమించుమా. ఆవేశం లో అన్న మాట ఎన్నో అనర్దాలకి దారి తీస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. మన మధ్య చిలిపి తగువులే కాని పెద్ద పోట్లాటలు ఉండ కూడదు. మనం ఒకరికి ఒకరు అని ఆ పైవాడే నిర్ణయించేసాడు.అది కాదని మనం ఒకరి తోడు మరొకరికి లేకుండా బ్రతకగలమా????? ఇప్పటి వరకు నేను నీతో ఎంతో అందమైన క్షణాలని అనుభవించాను. ఇక ముందు కూడా నా జీవితంలో నీతో గడిపే ప్రతి నిముషం ఎంతో మధురంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎప్పటికి చెరగని నీ చిరునవ్వుతో మొదలయ్యే మన ఉదయాలు, నిన్ను చూడబోయే సాయంత్రాల గురించి మధ్యాహ్నం నుంచే ఎదురుచూపులు, రాత్రి వేళ నీ వెచ్చని కౌగిలిలొ గువ్వపిల్లలా ఒదిగిపోవటం .......... ఇవన్ని మన రాబోయే అందమైన జీవితానికి కొన్ని ఉదాహారణలు మాత్రమె. త్వరలో మనం ఏకం కాబోతున్నపుడు, మన మధ్య దాంపత్యం అనే బంధం ఏర్పడబోతున్నప్పుడు, మన మధ్య ఉండవలసినవి ప్రణయ పోరాటాలు, అలకల పలక పైరాసే చిలిపి జ్ఞ్యాపకాలేకాని, గుండెల్ని గాయపర్చే పెద్ద పోట్లాటలు కాకూడదు.

నీతో ఎంతో అందమైన, ఆనందమైన జీవితాన్ని ప్రతి నిముషం ఆస్వాదించాలని కోరుకుంటూ, పెద్ద మనసుతో నన్నుక్షమిస్తావని ఆసిస్తూ
నీ ప్రేయసి

Saturday, July 11, 2009

ఒక చిన్న మాట....

1. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

2. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

3. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

4. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

5. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

6. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

7. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

9. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.

10. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది

By: Swami Vivekananda

Thursday, June 4, 2009

ప్రేమ - అపురూపమైన వరం

ప్రేమించడం, ప్రేమించబడడం మనిషికి దేవుడిచ్చిన అపురూపమైన వరాలు,
ప్రతి మనిషి ఎవరో ఒకరి చేత ప్రేమించబడతాడు, మరెవరినో ప్రేమిస్తాడు
కాని తను ప్రాణం కంటే అమితంగా ప్రేమించే వ్యక్తి, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఒకరైతే?
ఇక ఆ మనసుకి కలిగే ఆనందానికి అవధులు ఉంటాయా???
అలాంటి అవధులు లేని ప్రేమలోకంలో విహరిస్తున్నాను నేను,
ఇప్పుడు చెప్పండి, నా కంటే అదృష్టవంతులు ఈ లోకం లో ఇంకెవరైనా ఉంటారా?

Tuesday, May 26, 2009

ఆడది

యుక్త వయసు వచ్చేవరకు అమ్మ అడుగుజాడల్లో నడుస్తుంది,
పెళ్లి అయ్యే వరకు నాన్న చెప్పుచేతల్లో పెరుగుతుంది,
పెళ్లి అయ్యాక భర్త మనసు అర్ధం చేసుకొని నడుచుకుంటుంది,
పిల్లలు పెద్దయ్యాక, వాళ్ల జీవితాలకి, అవసరాలకి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకుంటుంది,
జీవితం లోని ప్రతి మలుపుని ఇంకొకళ్ళ కోసమో, ఇంకొకళ్ళ పైన ఆధారపడో మార్చుకుంటుంది,
మరి తన మనసు మాట ఎప్పుడు వింటుంది, తనక్కావల్సిన విధంగా ఎప్పుడు బ్రతుకుతుంది?
ఆడ దాని జీవితం ఇంతేనా, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం తను ఆవిరై పోవడమేనా?

Wednesday, May 20, 2009

నా కొత్త జీవితం

ఎన్నో రోజుల తర్వాత నాకు మళ్ళీ జీవితం అంతా కొత్తగా అనిపిస్తుంది, సూర్యోదయం చూడాలనిపిస్తుంది. సూర్యుని నులివెచ్చని కిరణాలు మనసుని ఆహ్లాద పరుస్తున్నాయి. పక్షుల కిలకిలరావాలు చెవులకి ఇంపుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరిని చూసినా చిరునవ్వుతో మాట్లాడాలనిపిస్తుంది. మనసుకు ఇష్టమైన పనులు చెయ్యాలనిపిస్తుంది. అందంగా సింగారించుకోవాలి అనిపిస్తుంది. నాకిష్టమైన వాళ్ళతో పదే పదే మాట్లాడాలి అనిపిస్తుంది. సుగంధ పుష్పాల సొగసుతనం చూడాలనిపిస్తుంది. బుజ్జి పాపాయిల బోసి నవ్వులు వినాలనిపిస్తుంది. అంతా "కొత్త బంగారు లోకం" లాగ ఉంది. ఇన్ని రోజులుగా నిస్సారంగా ఉన్నా నా జీవితంలో వెయ్యి వసంతాలు ఒక్క సారిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ లోకం, నేను ఇంతగా ఎందుకు మారిపోయామ అని ఆలోచిస్తే, అప్పుడు తెలిసింది, నేను ప్రేమలో పడ్డానని. ఇంత మధురానుభూతుల్ని, అమితమైన ప్రేమను నాకు అందిస్తున్న నా ప్రియ నేస్తమా, నీకే నా జీవితం అర్పితం, అంకితం.

ఇట్లు,
నీ ప్రేమ లోని అమృతాన్ని ఆస్వాదిస్తున్న నీ ప్రేయసి

Saturday, April 18, 2009

తెలియని నిజం

తామరాకు పై నీటిబిందువుకేం తెలుసు తాను ఎటువైపు వాలిపోతానో అని,
కొండకోనల పరుగులిడే వాగులకేం తెలుసు వెళుతున్నది ఉప్పు నీటి సంద్రంలోకని,
సప్తస్వరాలను దాచుకున్న కోయిలకేం తెలుసు తన రంగు నలుపని,
పరిమళాన్ని వెదజల్లే పూలకేం తెలుసు తన జీవిత కాలం ఒక్క రోజేనని,
ఎగసిపడే కేరటాలకేం తెలుసు కడలిని దాటి రాలేమని,
సముద్రగర్భంలో ఆల్చిప్పకేం తెలుసు తనలో స్వాతిముత్యం దాగుందని,
పంకజంలో పుట్టిన పద్మానికేం తెలుసు తనపై దేవతలు ఆశీనులవుతారని,
నా గుండెల నిండుగా ఉన్నా నీ రూపనికేం తెలుసు నీవు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుందని......

(By Anonymous)

ప్రేమ

వెయ్యి ఉలి దెబ్బల అనంతరం సుందర శిల్పం పుడుతుంది,
ఎన్నో ఎదురుచూపుల అనంతరం మగువ మనసులో ప్రేమ పుడుతుంది
ప్రియుడి తలంపుతో ప్రియురాలి పెదవులపై చిరుదరహాసం పుడుతుంది, సిగ్గుల మొగ్గవుతుంది
కొన్ని ఓటములు కలిస్తేనే ఒక గెలుపుకు స్పూర్తవుతుంది, ఆ స్ఫూర్తి తోనే విజయం వరిస్తుంది
ఒక సారి ప్రేమ కాదన్న బాధ కంటే మళ్లీ ప్రేమ దక్కించుకుంటే, ఆ ప్రేమ అమృతం కంటే మధురం అవుతుంది.

స్నేహితుడు

స్నేహానికి అర్ధం చెప్పిన ప్రాణ స్నేహితుడివి నీవు,
నేను ఆనందంగా ఉండాలని ప్రతిక్షణం పరితపించిన స్నేహానివి నువ్వు,
నా జీవితంలో నీతో స్నేహం ఒక భాగమైన తరుణం లో,
నేను నీ స్నేహం కాదు, నీ ప్రేమని ఆకాంక్షిస్తున్నాని నీవు అన్న మరుక్షణం,
నేను అధఃపాతాళానికి వెళ్ళాలన్న భావం, నువ్వు నాతో ఇక స్నేహం చేయవన్న భయం నా మనసుని కలచి వేసాయి.
ఓ స్నేహమా! చివరిగా ఒక్క మాట, నువ్వు నా స్నేహం కావలనుకునా, లేకున్నా,
నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణ స్నేహితుడ్ని నేను వదులుకోను, నీ స్నేహాన్ని ఎప్పటికి వదులు కోలేను.....

ఆశ - నిరాశ

నీ నీడనైనా కాకపోతిని, నిను వెన్నంటే ఉండవచ్చునని,
గాలినైనా కాకపోతిని, నీ శ్వాసగా మారవచ్చని,
రాయినైనా కాకపోతిని, నీ పాద స్పర్శకు నోచుకోవచ్చని,
నీ మనసుకైనా నచ్చకపోతిని, నీ ప్రేయసిగా మారవచ్చని,
మనసుకింపుగైనా లేకపోతిని, నీ ప్రాణ స్నేహం కావడానికి,

ఓ ప్రియతమా!
ప్రియుడివి కాకపోయినా స్నేహితుడిగా మిగిలిపోతావని ఆశిస్తూ.......

నీవు లేక

నీవు లేక జీవితం లేదనుకున్నా,
నీ శ్వాసని గుర్తించలేని మనసెందుకు అనుకున్నా,
నీవు తాకలేని నా రూపమెందుకు అనుకున్నా,
నీ ప్రేమ పొందలేని బ్రతుకెందుకు అనుకున్నా
కాని, కనీసం నీ స్నేహం దొరికిందన్న సంతోషం,
నీ శ్వాసలో శ్వాసనై, మనసులో మనసునై, అడుగులో అడుగునై బ్రతకాలన్న ఆరాటం,
నీ మీద దినదిన ప్రవర్ధమవుతున్నఅభిమానం,
ఇంత జరుగుతున్నా, నువ్వు నా వాడివి అవుతావన్న నమ్మకం,
వెరసి, నీవు లేక నేను లేనని చెప్పకనే చెపుతున్న నా మౌనం.

ఉంగరం

పసితనంలో చిట్టిపొట్టి వేళ్ళకి పెద్దలు తొడిగే అపురూప 'అలంకారం'
యుక్త వయసులో పరిణయానికి నాందిగా 'నాకు నువ్వు నీకు నేను' అనుకునే 'నిశ్చితార్థం'
కళ్యాణ మహోత్సవంలో భార్యాభర్తల అనురాగాన్ని సూచించే వివాహ 'సంప్రదాయం'
అంతేనా....... ఒకనాటి గాంధర్వ వివాహాలకు సులభ 'సాధనం'
అన్నింటిని మించి పరువాల ప్రాయంలో చిగురించిన ప్రేమకు 'బహుమానం'
ఎన్నటికి మరువలేని ఓ 'మధుర జ్ఞాపకం' అదే సోయగాల 'ఉంగరం'

Thursday, March 19, 2009

I Promise.......

I Promise I will be there when you wake up from sleep

I Promise I will hold your hand when we walk on the beach on a lovely evening

I Promise I will watch every Sun Rise and Sun Set along with you

I Promise I will conspire with you in your naughty pranks

I Promise I will be the first person to lend my shoulder when you want to cry

I Promise I will be the first one to make you laugh after you cry

I Promise I will be there for you every time you need me

I Promise I will love you more and more with each passing second

I Promise I will support you in every difficulty you face in life

I Promise I will Love you forever and ever.

Wednesday, February 4, 2009

Things you want to do before you die

I got this list from some place (I dont remember from where, I had it saved on my laptop for a long time now). I like to do atleast 50% of what this list consists of. Let's see how it goes.

If you have done anything or wanna do some thing like this, please add your comments... I'll include them in this list. Happy reading and happy thinking........... :-)


1. Swam with dolphins
2. Climbed a mountain
3. Taken a Ferrari for a test drive
4. Been inside the Great Pyramid
5. Taken a candlelit bath with someone
6. Said “I love you” and meant it
7. Hugged a tree
8. Bungee jumped
9. Visited Paris
10. Watched a lightning storm at sea
11. Stayed up all night long and saw the sun rise
12. Gone to a huge sports game
13. Walked the stairs to the top of the leaning Tower of Pisa
14. Grown and eaten your own vegetables
15. Touched an iceberg
16. Slept under the stars
17. Changed a baby’s diaper
18. Taken a trip in a hot air balloon
19. Watched a meteor shower
20. Gotten drunk on champagne
21. Given to charity
22. Looked up at the night sky through a telescope
23. Had an uncontrollable giggling fit at the worst possible moment
24. Had a food fight
25. Bet on a winning horse
26. Asked out a stranger
27. Had a snowball fight
28. Screamed as loudly as you possibly can
29. Held a lamb
30. Seen a total eclipse
31. Ridden a roller coaster
32. Danced like a fool and didn’t care who was looking
33. Adopted an accent for an entire day
34. Actually felt happy about your life, even for just a moment
35. Had two hard drives for your computer
36. Taken care of someone who was drunk
37. Had amazing friends
38. Danced with a stranger in a foreign country
39. Watched whales
40. Taken a road-trip
41. Gone rock climbing
42. Taken a midnight walk on the beach
43. Gone sky diving
44. Been heartbroken longer than you were actually in love
45. In a restaurant, sat at a stranger’s table and had a meal with them
47. Milked a cow
48. Lounged around in bed all day
49. Gone scuba diving
50. Kissed in the rain
51. Played in the mud
52. Played in the rain
53. Gone to a drive-in theatre
54. Visited the Great Wall of China
55. Started a business
56. Fallen in love and not had your heart broken
57. Gotten married
58. Been in a movie
59. Crashed a party
60. Gone without food for 5 days
61. Won first prize in a costume contest
62. Gotten a tattoo
63. Been on a television news program as an “expert”
64. Gotten flowers for no reason
65. Performed on stage
66. Been to Las Vegas
67. Recorded music
68. Kissed on the first date
69. Bought a house
70. Been on a cruise ship
71. Spoken more than one language fluently
72. Raised children
73. Passed out cold
74. Taken an exotic bicycle tour in a foreign country
75. Picked up and moved to another city to just start over
76. Sang loudly in the car, and didn’t stop when you knew someone was looking with the windows open
77. Wrote articles for a large publication
78. Lost over 50 pounds
79. Held someone while they were having a flashback
80. Broken someone’s heart
81. Helped an animal give birth
82. Won money on a TV game show
83. Broken a bone
84. Gone on an African photo safari
85. Had a facial part pierced other than your ears
86. Fired a rifle, shotgun, or pistol
87. Ridden a horse
88. Hiked to the bottom of the Grand Canyon
89. Slept for 30 hours in a 48 hour period
90. Visited all 7 continents
91. Had your picture in the newspaper
92. Changed someone’s mind about something you care deeply about
93. Gone back to school
94. Eaten fried green tomatoes
95. Selected one “important” author who you missed in school, and read
96. Attended school reunions
97. Communicated with someone without sharing a common spoken language
98. Written your own computer language
99. Thought to yourself that you’re living your dream
100. Built your own PC from parts
101. Sold your own artwork to someone who didn’t know you
102. Had a booth at a street fair
103. Dyed your hair
104. Been a DJ
105. Saved someone’s life
106. Visit Tajamahal (User Submitted)

107. "bhagwanthuni premlo munigi thelatam " feeling ecsatsy in god's love Try meditation hey it works trust me......... (User Submitted)