Friday, September 18, 2009

నా వేసవి జ్ఞాపకాలు...

ఉమాశంకర్ గారి "Anantham" బ్లాగ్ చదివిన తర్వాత నాకు నా చిన్నప్పటి వేసవి సెలవలు గుర్తుకొచ్చాయి. వేసవి జ్ఞాపకాలు అనటంకంటే "నా చిన్న నాటి మధుర స్మృతులు" అనటం చాల కరెక్ట్ అనుకుంటా.
మా అమ్మమ్మ మా అమ్మ చిన్నతనం లోనే చనిపోవటం వల్ల నాకు మా తమ్ముడికి అమ్మమ్మ గారిల్లు ఉన్నా లేనట్టే. మా అమ్మని సొంత కూతిరి లా పెంచింది మా పెద్దమ్మ (మా అమ్మకి పెద్దక్క) పెద్దనాన్న. ప్రతి సంవత్సరం మా వేసవి సెలవులన్ని మా పెద్దమ్మ వాళ్లా ఇంట్లోనే గడిచేవి.
మా పెద్దమ్మ వాళ్ళది ఖమ్మం జిల్లాలో గోపవరం అనే చిన్న పల్లెటూరు. మా సెలవుల సందడి మా చివరి పరీక్ష సోషల్ స్టడీస్ తోనే మొదలయ్యేది. మా పెద్ద నాన్న ఆ రోజు తెల్లవారుఝామున వచ్చేసేవారు మమ్మల్నిద్దరిని ఊరికి తీసుకెళ్ళడానికి. పరీక్ష మధ్యాహ్నం కల్లా అయిపోవడం తరువాయి, ఇంటికి రావడం, భోజనం చెయ్యటం, రెండింటికల్లా భయల్దేరే వాళ్ళం బస్సులో. అస్సలు ఈ బస్సు ప్రయాణం అంటే మాకు ఎంత సరదానో చెప్పలేను. బస్సు ఆగిన ప్రతి చోట మా పెద్దనాన్న మాకు అడిగిందల్లా కాదనకుండా తినుబండారాలు కొనిచ్చేవాడు. రాత్రి పదింటికల్లా ఖమ్మం లో దిగేవాళ్ళం. మా ఊరికి వెళ్ళే చివరి బస్సు అప్పటికల్ల వెళ్ళిపోయేది. మళ్ళి తెల్లవారు ఝామున నాలుగింటి వరకు మా ఊరికి బస్సు ఉండదు. అప్పుడు మా పెద్దనాన్న మా ఇద్దరికీ అక్కడే మెస్సులో భోజనాలు పెట్టించి, పక్కనే ఉన్న సినిమా హాల్ కి తీసుకెళ్ళేవాడు. నేను చివరి సారి వేసవి సెలవులకి (దాదాపుగా పదేళ్ళు అయింది) వెళ్ళినప్పుడు అలా చూసిన సినిమా "సూత్రధారులు" నాకు ఇప్పటికి ఆ సినిమా చూసినా, అందులో పాటలు విన్నా, ఆ వేసవి జ్ఞాపకాలే కళ్ళ ముందు మేదుల్తాయి. అలా సినిమా చూస్తూనే మా తమ్ముడు, నేను మా పెద్దనాన్న చెరో భుజం మీద నిద్ర పోయేవాళ్ళం. సినిమా అయ్యాక పెద్ద నాన్న మమ్మల్ని నిద్రలేపి బస్టాపు కి తీస్కొచ్చి, బాదాం పాలు కొనిచ్చేవాడు. అవి తాగాలంటే మాకు భలే సరదాగా ఉండేది. పాలు తాగి కాసేపు అలా బస్టాపు లోని బెంచిపై కూర్చొని అలా అర్ధరాత్రి కూడా కోలాహలంగా తిరిగే జనాల్ని, తలెత్తి చూస్తే తప్ప కనపడని టెలివిజన్ వైపు మార్చి మార్చి చూస్తూ మళ్ళి నిద్రపోయే వాళ్ళం. తెల్లవారు ఝామున నాలుగింటికి గోపవరం బయల్దేరేది మొదటి బస్సు. ఇక పెద్దనాన్న ముందు మా సామాన్లు బస్సులో పెట్టి వచ్చి , నన్ను నిద్ర లేపి, మా తమ్ముడిని భుజానవేస్కొని బస్సు ఎక్కటం నాకింకా కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ఇక ఆ బస్సులో ఉన్న కోలాహలం చూస్తే మాకు నిద్ర మత్తు వదిలిపోయేది. పాల కేంద్రానికి పాలు పోయటం కోసం పెద్ద పెద్ద క్యాన్లతో ఎక్కే వాళ్లు, పేపరు కట్టలు బస్సు కదిలే ముందే డ్రైవర్ కి అందాచేయాలని ఆత్రుత పడే పేపర్ అబ్బాయిలు, ఆ పేపర్ కట్టలోంచే మొత్తం వార్తలు చదివేయ్యాలి అనే తాపత్రయం తో డ్రైవర్ పక్కనే నక్కి కూర్చునేవాళ్లు, కూరగాయ గంపలు, పళ్ళ గంపల తో, తల నిండా పూలు పెట్టుకొని ఎక్కే ఆడవాళ్ళు ....అబ్బ అసలు వాళ్ళందరిని చూస్తుంటే మాకు చాల సరదాగా ఉండేది. చెప్పడం మర్చిపోయానండోయ్... మా పెద్ద నాన్న ఆ ఊర్లో చెప్పుకోదగ్గా మోతుబరి రైతుల్లో ఒకరవటం, రాజకీయాల్లో తిరగటం వల్ల ఆయన్ని అందరు గుర్తుపట్టేవారు. ఇక మా ఇద్దరి పరిచయం అక్కడే మొదలయ్యేది బస్సులో. (మా అమ్మ పేరు సరస్వతి. అమ్మ పెద్దమ్మ వాళ్ల ఊళ్ళోనే పెరగటం వల్ల అందరికి సరసమ్మ గారిగా తెలుసు). అలా మేము "సరసమ్మ గారి పిల్లలు" గా అందరికి పరిచయడం చేయ బడే వాళ్ళం. అలా మా పరిచయం జరగగానే అక్కడ మేము ఇద్దరమే "ఫోకస్ పాయింట్" అయ్యేవాళ్ళం. అందరు అమ్మాయి, అబ్బాయి ఎంత బాగున్నారు ముత్య్యాల్లాగా అనగానే మేము "మా అంత గొప్ప వాళ్లు లేరు" అనుకునేవాళ్ళం.....అలా సరదాగా మా బస్సు ప్రయాణం జరిగేది......
తర్వాత....మా సెలవులు ఎలా గడిచాయో నా తర్వాతి టపాలో చెపుతాను
అంత వరకు...సెలవు.

10 comments:

Sujata M said...

అందరు అమ్మాయి, అబ్బాయి ఎంత బాగున్నారు ముత్య్యాల్లాగా అనగానే మేము "మా అంత గొప్ప వాళ్లు లేరు" అనుకునేవాళ్ళం..... haa haa.

I guess we are all like that. So Sweet.

సుభద్ర said...

swetha,
baagunaayi...mee vesavi kaburlu..nxt post kosam wait chetuntaanu.ee word verification teeseyandi. coments raayatani vachi word verification chusi sagam mandi raayakunadaane velli potaaru.

మురళి said...

ఇవాళే మొదటిసారి మీ బ్లాగు చూడడం.. బాగున్నాయి టపాలు.. పెద్దయ్యాక యెంత చక్కని జీవితాన్ని గడిపినా బాల్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం.. ఇలాగే కొనసాగించండి...

Swetha said...

Sujata gaaru,

thank you for visiting my blog. Yeah we are all like that as children. I wish we had that innocence still left.....well that's the way of life i guess.

Thank you for visitng my blog once again and keep visiting.


Subhadra gaaru,

thank you for the comments andi. next post thvaralone raasthaanu. Meeru cheppinattugaa word verification theesesaanu. nenu koththa blogger ni, andulo raayatam peddagaa alavaatu leni daanni....ilaa meeru feedback isthe nenu chaala improve chesukogalanu...thank you andi.

murali gaaru,
meeru naa tapaa ki comment raasaaru ante naaku chaala anandangaa undandi.....nenu mee nemalikannu roju chaduvuthaanu.
meeru cheppinattugaa.....nenu naa baalyaanni eppatiki marchipolenu...alaanti madhura smruthulu naa baalyam nindaa unnaayi.



thank you for visiting my blog everyone, please keep visiting.

Hima bindu said...

చక్కటి జ్ఞాపకాలు,తరువాత పోస్ట్ లకు ఎదురుచూస్తూ.....

ఉమాశంకర్ said...

తెల్లవారుఝాము బస్సు ప్రయాణాలూ, వేసవి బాదంపాలూ, సినిమా చూస్తూ నిద్రపోవడమూ...... చిన్నప్పటి జ్ఞాపకాల్ని తట్టిలేపారు.

అన్నీ కాకున్నా మీ బ్లాగులోని కొన్ని టపాలు చదివాను. బాగా రాస్తున్నారు.. ఇలానే కొనసాగించండి. అన్నట్ట్లు తరువాతి టపా వెంటనే రాసేయండి ..

SIMHA said...

hi swetha garu..
yelavunnaru..
after long time.
see this blog..
http://srisimhathodeti.blogspot.com/

SIMHA said...

swetha garu...
mee manasulo matalu chala bagunnayi...
meeru ee blog chusi mee abhiprayaanni cheppagalaraa..
please.
http://srisimhathodeti.blogspot.com/

Amit MK said...

hi swetha,

i dont know if you recall me or not but i do. i used to come to your desk when you were at dell and talked to you for sometime..within a short time we became good friends.

I really liked your blog..everythin about it.. the way you recalled your memories at your place.. amazing narration...reading that i wished that i had that kind of childhood .. sad that i was born and brought up in HYD .. so no chance of any countryside experience.. i get excited lookin countryside out of train window whenevr i travel to tirupati..

the quotes,thoughts all of them are amazing..thank you for writin..

Amit

kakani santosh kumar said...

ఇది మొత్తం చదివాకా ఇంక మేము బస్సు ప్రయాణం దెగ్గరే ఉన్నాం ఇంక చాల ఉన్దీ అని సుస్పష్టం అవ్తుంది కావునా తొందరలో నెమ్మదిగా అలోచించి బాగా గుర్తు తెచ్చుకోని రాయి

మొత్తం చదివాకా నిజం గానే నీలో మంచి రచన స్ఫూర్తి ఉన్నటు నాకు ఆగుచరిస్తున్దీ అందున నువ్వు వెంటనే ఈ ఒక "వేసవి సెలవలు" కి పొడిగింపు ఇస్తావని ఆసిస్తూ
ఆహ కధలోని మీ తమ్ముడి పాత్రధారి
సంతోష్ కాకాని వ్రాయు చున్నది